Shiva Tandava Stotram Lyrics in Telugu and English
Shiva Tandava Stotram Lyrics in Telugu and English.శివ తాండవ స్తోత్రం సాహిత్యం తెలుగు మరియు ఆంగ్లంలో. శివ తండవ వివరాలు . సద్గురు : రావణుడు శివుని గొప్ప భక్తుడు, వారిద్దరి గురించి ఎన్నో కధలు ఉన్నాయి. ఒక భక్తుడు గొప్పవాడు కాకూడదు, కానీ రావణుడు గొప్పవాడయ్యాడు. దక్షిణం నుండి ఎంతో దూరం ప్రయాణించి కైలాసానికి చేరుకున్నాడు – అంతదూరం నడిచి రావడం మీరు ఊహించుకోండి – శివుని పొగుడుతూ పాటలు పాడటం మొదలుపెట్టాడు. అతని దగ్గర ఉన్న ఢంకాను వాయిస్తూ 1008 పద్యాలని అలా ఆశుకవిత్వముగా వినిపించాడు, అదే శివ తాండవ స్తోత్రం. ఆ పాటలు విని శివుడు ఎంతో ఆనందించాడు. పాడుతూ అతడు మెల్లగా కైలాసాన్ని దక్షిణ వైపు నుండి ఎక్కడం మొదలుపెట్టాడు. శివుడు పూర్తిగా అతడి పాటలో తన్మయుడై పోగా రావణుడు దాదాపు పైకి ఎక్కడo పార్వతి చూసింది. ఇక్కడ పైన ఇద్దరికి మాత్రమే చోటు ఉంది. “ఇతడు పైదాకా వచ్చేస్తున్నాడు” అంటూ శివుడిని తన్మయత్వంనుండి బయటకు తీసుకు రావడానికి ప్రయత్నించింది. కానీ శివుడు ఆ పాటలో పూర్తిగా నిమగ్నుడయి ఉన్నాడు. చివరకు పార్వతి శివుడిని తన్మయత్వం నుండి బయటకు తీసుకురాగా, రావణుడు శిఖరానికి చేరుకోగానే శివుడు అతడిని తన కాలితో క్రిం...